Motlapalli | కాల్వశ్రీరాంపూర్, జనవరి 14 : సంక్రాంతి సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ముగ్గుల పోటీలను సర్పంచ్ తులా మనోహర్రావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 26 మంది మహిళలు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.2వేల విలువగల మొదటి బహుమతి, రూ.వెయ్యి విలువగల ద్వితీయ బహుమతి, రూ.ఐదు వందల విలువల తృతీయ బహుమతి అందజేశారు.
అలాగే ఈ పోటీలో పాల్గొన్న 23 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమలత, వార్డు సభ్యులు మానస, పోచాలు, రమేష్, సంపత్, జీపీవో స్వాతి, ఏఈఓ స్పందన, సిరిసిల్ల ఏఆర్ ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ దొమ్మటి రవి, రేషన్ డీలర్ మేకల లక్ష్మి, కారోబార్ తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.