Karimnagar | కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 28 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా, సైన్స్ ప్రాముఖ్యతను, విద్యార్థులలో పరిశోధన స్ఫూర్తిని పెంపొందించడానికి కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట ఆటానమస్ డిగ్రీ, పీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్ హాజరై నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ఎగ్జిబిట్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కే భవాని, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే అనుష, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.