టాప్‌గేర్‌లో వాహన అమ్మకాలు.. మారుతి, హ్యుందాయ్ రికార్డు స్థాయి విక్రయాలు
వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు రికార్డు స్థాయిలో వాహనాలను విక్రయించాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు రికార్డు స్థాయిలో వాహనాలను విక్రయించాయి. ప్రస్తుత నెలలో ధరలను పెంచబోతున్నట్టు ఆటోమొబైల్ దిగ్గజాలు ప్రకటించడం, జీఎస్టీ ప్రయోజనాలు లభించడం, వడ్డీరేట్లు తగ్గడం, రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు లభించడంతో వాహనాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది.
గడిచిన నెలలో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 4.65 లక్షల నుంచి 4.7 లక్షలకు చేరుకున్నాయని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. కిందటేడాది ఇదే నెలలో 3.5 లక్షల స్థాయిలో ఉండగా, ఈ సారి 33 శాతం వరకు వృద్ధి నమోదైందన్నారు. గత నెలలో మారుతి 1,96,203 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా, హ్యుందాయ్ 54,210 యూనిట్ల విక్రయాలు జరిపింది.
హ్యుందాయ్ చరిత్రలో ఒక నెలలో ఈ స్థాయిలో వాహనాలను విక్రయించడం ఇదే తొలిసారని, కొనుగోలుదారుల నుంచి పలు మాడళ్లకు డిమాండ్ నెలకొనడం వల్లనే ఇది సాధ్యమైందని హ్యుందాయ్ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ తెలిపారు. టాటా మోటర్స్ వాహన విక్రయాల్లో 58 శాతం పెరుగుదల నమోదుకాగా, మహీంద్రా 20 శాతం, హోండా కార్స్ ఇండియా 48 శాతం, టయోటా కిర్లోస్కర్ 5 శాతం, కియా 27.4 శాతం చొప్పున వృద్ధిని సాధించాయి.
జూలై నెలలో వాహన అమ్మకాలు

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

