Facebook | సుల్తానాబాద్, మే 31 : ఫేస్ బుక్ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిన సంఘటన శనివారం సుల్తానాబాద్ లో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహిత భర్త ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. భర్త హైదరాబాదులో కూలీ పనులు చేస్తుండగా, సజావుగా సాగుతున్న వీరి కాపురంలో ఫేస్ బుక్ పరిచయం చిచ్చు పెట్టింది. భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవర్ తో ఆమెకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.
అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీయడంతో ఏకంగా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. వీరి బాగోతం కాలనీవాసులకు తెలియడంతో పలుమార్లు నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందని, ఆమెలో మార్పు రాకపోవడంతో ఎన్నో రోజులుగా ఈ బాగోతాన్ని గమనిస్తూ వస్తున్న కాలనీవాసులు శనివారం ఉదయం వారిని పట్టుకుని బోరింగుకు కట్టివేసి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.