ఇల్లంతకుంట, డిసెంబర్ 20: ఇల్లంతకుంట స్కూల్కు గోల్డెన్ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇందన పొదుపు మంత్రంగా విద్యుత్త్, సౌరశక్తి వినియోగంపై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులకుగాను ఈ పురస్కారం వరించింది.
కాగా, బుధవారం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి చందన్ మిత్ర చేతుల మీదుగా హెచ్ఎం ప్రేమలత, నోడల్ అధికారి మహేశ్ చంద్ర గోల్డెన్ అవార్డును అందుకున్నారు.