Chigurumamidi | చిగురుమామిడి, జూలై 22 : చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో పలు వార్డులలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులను అధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా గ్రామంలో అన్ని వీధులలో సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు.
దశలవారీగా పనులను చేపడతామని పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కాల్వ రమేష్, బిఆర్ఎస్ నాయకులు బెజ్జంకి రాంబాబు, కాశబోయిన రాజు, కారోబార్ గొల్లపల్లి సత్యనారాయణ, వార్డు సభ్యులు అనిల్, హరీష్, సౌందర్య, అంజవ్వ, భాగ్య, శ్రీనివాస్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.