Peddaplly | పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 21 : గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు మురికి కాలువలు, చెట్లపొదల్లో దోమలు వృద్ధి చెందకుండా పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ నరహరి అన్నారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో ఆదివారం ఎన్ఎస్ఎస్ శిబిరం నిర్వహణలో భాగంగా వాలంటీర్లు రహదారులు, ఇండ్ల పరిసరాలను శుభ్రం చేసి దోమలు వృద్ధి అయ్యే ప్రాంతాలను గుర్తించి పారిశుధ్య చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ నరహరి మాట్లాడుతూ పరిశుభ్రత పాటిస్తేనే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా ఉంటామని అన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంతోష్ రెడ్డి, అశోక్ , శ్రీలత, దీప, ప్రసూన, వాలంటీర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.