Godavarikhani | విధుల్లో మానవత్వం… ప్రమాద స్థలంలో మానవీయ స్పందన
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్‌నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
- ప్రజా భద్రత, నేరాల నియంత్రణతో పాటు ప్రాణరక్షణలో ముందుండి ప్రమాద బాధితులకు తక్షణ సహాయం చేసిన గోదావరిఖని పోలీసులు
Godavarikhani | జ్యోతి నగర్, జులై22 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్‌నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీకి టైరు పంక్చర్ కావడంతో దానిని రోడ్డుపై నిలిపి ఉంచారు. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న మరో డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఆ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డీసీఎం వ్యాన్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు.
ఆ సమయంలో నైట్ పెట్రోలింగ్‌లో ఉన్న వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రజా భద్రత,నేరాల నియంత్రణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు కూడా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించిన పోలీసు అధికారుల సేవలను స్థానిక ప్రజలు అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

