Huzurabad | హుజూరాబాద్ టౌన్, మే 28 : ఉత్తమ సేవలు అందించినప్పుడే సత్కారాలు, గౌరవం దక్కుతుందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్నారు. ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానసతో పాటు వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగిణి దాసరి సరళ, ఏఎస్సై బండ సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ స్వరూపా ముత్యంరావు లను పట్టణానికి చెందిన సిద్ధార్థనగర్ సొసైటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య బుధవారం ఘనంగా సన్మానించారు.
శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ఒకే వేదికపై వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమమైన సేవలు అందించినప్పుడే ఇలాంటి సన్మానాలు, సత్కారాలతో ప్రజలు గౌరవిస్తారని అభిప్రాయ పడ్డారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించి, ఇంకా పేరు ప్రఖ్యాతలతో పాటు ఉన్నత పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే, జూనియర్ సివిల్ జడ్జి మానసను హుజూరాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సిద్ధార్థ నగర్ కాలనీ అధ్యక్షుడు సాగి వీరభద్రరావు, సీనియర్ నాయకులు తోట రాజేంద్రప్రసాద్, ముత్యంరావు, పీవీ సేవాసమితి అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి బీ మనోజ్, పీడీ రాజి రెడ్డి, రవీందర్, తిరుపతి రెడ్డి, మాడ రాజి రెడ్డి, రాజమౌళి, సంపత్ రావు, న్యాయవాది శ్రీనివాస్, శ్రీనివాస రావు, రవీందర్, జయవర్ధన్, చిలుకమారి శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.