Hijra festival| కోల్ సిటీ, ఫిబ్రవరి 24 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తొలిసారిగా హిజ్రాలు పండుగ చేసుకున్నారు. రోజంతా ఆట పాటలు, నూతన వస్త్రాలంకరణ, అమ్మవారి పూజా మహోత్సవాలతో ఆకట్టుకున్నారు. గోదావరిఖని గంగానగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం రాష్ట్ర సమ్మేళనం జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 1500 మంది వరకు హిజ్రాలు తరలిరావడంతో సందడి నెలకొంది.
అమ్మ తెలంగాణ రాష్ట్ర హిజ్రా సంఘం అధ్యక్షురాలు ఓరుగంటి లైలా ఆధ్వర్యంలో జరిగిన ఈ రాష్ట్ర వేడుక సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలరించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆట, పాట, జల్సా, సారీ ఫంక్షన్, అమ్మవారి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాని, భవానీ, లాస్య, సుపు, అనిత శ్రీ, నమ్మవ్వతోపాటు అధిక సంఖ్యలో హిజ్రాలు పాల్గొన్నారు.