Minister Laxman Kumar | గొల్లపల్లి : యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇబ్రహీంనగర్ గ్రామంలో జగిత్యాల జిల్లా మామిడి రైతులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు. రైతులు వరి సాగును తగ్గించి మామిడి కూరగాయలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు.
గత రబీ సీజన్లో 5000 మెట్రిక్ టన్లో ధాన్యం కొనుగోలు చేశామని, ఆ ధాన్యంతో గోదాములు మిల్లులు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. జిల్లా ఉద్యాన అధికారి లత, పొలాస శాస్త్రవేత్త స్వాతి, కొమ్మ కత్తిరింపుల ప్రత్యేక అధికారి భగవాన్ మాట్లాడుతూ మామిడిలో కొమ్మ కత్తిరింపుల అధికారి భగవాన్ లు రైతులకు కొమ్మ త్రించే విధానము మందుల యాజమాన్యం నీటిపారుగలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శోభన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.