Siricilla | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గ్రామానికి చెందిన కొండవేని గంగా జమున అనే యువతి కేసిఆర్ చేపట్టిన పథకాలను ముగ్గు రూపంలో వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
కాగా ఈ పోటీల్లో ఆమె కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కంటి వెలుగు, షాదీ ముబారక్ ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను ముగ్గు రూపంలో వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ముగ్గుల పోటీ నిర్వహించిన జగ్గారావుపల్లి గ్రామ సర్పంచ్ మధు, ఉప సర్పంచ్ లావణ్య, వార్డు సభ్యులు పలువురు గంగా జమునను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బుర్ర పూర్ణ చందు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.