Helpline | కోల్ సిటీ, జూలై 23: ఇటీవల కాలంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రామగుండం నగర పాలక సంస్థ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితిలో సహాయక చర్యల నిమిత్తం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ అందుబాటులోకి తీసుకవచ్చినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ అరుణ శ్రీ తెలిపారు.
గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే హెల్ప్ లైన్ నంబర్లు 9392483953, 9603666444లో సంప్రదించాలని కోరారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.