Vemulawada | హెల్మెట్ భారం కాదు, భద్రతే ప్రాణాధారం.. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్
వాహనదారుడికి హెల్మెట్ భారం కాదని అది ప్రాణాధారమని గమనించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు.
- నిబంధనలు పాటించిన వాహనదారులకు గులాబీ పువ్వు అందజేసిన పోలీసులు
Vemulawada | వేములవాడ, ఫిబ్రవరి 23 : వాహనదారుడికి హెల్మెట్ భారం కాదని అది ప్రాణాధారమని గమనించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు సోమవారం అవగాహన కల్పించారు. ముందుగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ పువ్వు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ హెల్మెట్ భారం కాదని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని వారే ఎక్కువ సంఖ్యలో తీవ్ర ప్రమాదాలకు లోనై కుటుంబానికి దూరమవుతున్నారని వివరించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాఫిక్ సీఐ సురేష్, వేములవాడ ట్రాఫిక్ ఎస్సై రాజు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

