సైదాపూర్, సెప్టెంబర్ 12: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం మాడల్ స్కూల్ పరిసరాలు జలమయమయ్యాయి. గురువారం రాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజామున వరకు కురిసిన వానలతో సైదాపూర్ న్యాల చెరువు, ఆకునూర్ చెరువు, వెనెకేపల్లి తుమ్మల చెరువు తో పాటు పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. చెరువుల మత్తడి నుంచి నీరు భారీగా వాగులోకి చేరి ప్రవహిచడంతో సోమారం మోడల్ స్కూల్ జలమయం అయింది.
స్కూల్ లోని హాస్టల్ విద్యార్థులు అక్కడే ఉండడంతో తల్లితండ్రులు భయందోళనకు గురయ్యారు. స్థానికులు, తల్లితండ్రులు విద్యార్థినిలను బయటకు తీసుకువచ్చారు. విద్యార్థులు వుండే హాస్టల్, స్కూల్ ఇలా జలమయం అవుతుందని సమస్య కు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.