Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్ జూలై 30 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలకు జలకళ వచ్చింది. జాఫర్ఖాన్పేటలో నాగుల మల్యాల రవీందర్, ఈరవేన లక్ష్మమ్మ ఇంటి గోడలు కూలిపోయాయి. మీర్జంపేట్ తారుపల్లి గ్రామాల మధ్యన ఉన్న నక్కల ఓర్రె ఉప్పొంగుతోంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు.
పెద్ద రాతిపల్లి గ్రామ శివారులో మట్టల వాగు పరివాహక ప్రాంతం వెంట ఉన్న పంట పొలాలు నీట మునిగి కోతకు గురయ్యాయి. హుస్సేన్ మియా వాగు ఉధృతంగా ప్రవహిస్తొంది. వర్షాలు ఎక్కువగా ఉన్నందున అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని తహసీల్దార్ రాపల్లి రాముడు, ఎస్సై గట్ల సుధాకర్ సూచించారు.