Handloom workers | పెద్దపల్లి, ఆగస్టు7: ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సదుపాయాలను వినియోగించుకుంటూ చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు ఆకాంక్షించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కాంప్లెక్స్ మెయిన్ గేట్ నుంచి సమావేశం మందిరం వరకు చేనేత కార్మికులు ర్యాలీ తీశారు. కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీతలైన చేనేత కార్మికులకు, సీనియర్ నేత కార్మికులను అదనపు కలెక్టర్ శాలువాలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. అలాగే చేనేత రంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్, డీఎంవో ప్రవీణ్ కుమార్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.