కరీంనగర్ కార్పొరేషన్ : ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ని ప్రకటించిన సీఎం రేవంత్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ప్రచార సభలో దాని గురించి ఎందుకు మాట్లాడటంలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ప్రశ్నించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆ పార్టీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేశారన్నారు.
యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పకనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీఎం స్థాయి వ్యక్తి ఒకేరోజు మూడు సభల్లో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. సీఎం మాటల్లో ఆ పార్టీ ఓటమి స్పష్టంగా కనిస్తుందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి లను ఓటర్లు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.