Lions Club | కోల్ సిటీ, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయులు దేశ భవిష్యత్ ను నిర్మించే పట్టుగొమ్మలని రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకని శుక్రవారం లయన్స్ భవన్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు. సమాజంలో వివిధ రంగంలో విశిష్ట సేవలు అందించే నిష్ణాతులు ఎందరో ఉంటారని, కానీ వారందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులని పేర్కొన్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధన, విద్యారంగానికే ఆయన జీవితంను అంకితం చేశారనీ, భారత రాష్ట్రపతిగా, విద్యావేత్తగా దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. ఆయన బాటలో నడుస్తూ ఎంతోమంది విద్యార్థులను దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దుతూ విశిష్టసేవలందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు గడ్డం జగదీశ్వర్, కానుగంటి శ్రీనివాస్, శశికళ, సంధ్యారాణి తదితరులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్టీలు లయన్ ఎల్లప్ప, సారయ్య, రాజేంద్ర కుమార్, పీ మల్లికార్జున్, బంక రామస్వామి, కళావతి, మనీషా అగర్వాల్, రంగమ్మ, సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.