Guru Nanak | జగిత్యాల, నవంబర్ 5 : గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాలలోని తహసీల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీఎస్ రాజు, చిట్ల గంగాధర్, అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ గురు నానక్ సిక్కుల మొదటి గురువని, సిక్కు మత స్థాపకుడు గొప్ప మానవతావాదని చెప్పారు. గురు నానక్ బోధనలు లక్షలాదిమందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయని అన్నారు.
ప్రపంచ మానవాళిని మంచితనం సేవ, శాంతి వైపు నడిపిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. గురునానక్ సామాజిక అసమానతలను కుల వ్యవస్థను వ్యతిరేకించరని దేవుడు ఒక్కడేనని సర్వంతర్యామి అని అందరిలో అన్నిటిలో ఆ పరమాత్ముని చూసినవారే భగవత్ కృపకు పాత్రులు అవుతారని బోధించాడు. సర్వ మానవ సమానత్వాన్ని కాంక్షించాడని, నిజాయితీతో కూడిన జీవితం ప్రధానమని చెప్పాడని, మహిళలను గౌరవించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఇతరులను ఎలా గౌరవించాలి అందరి సంక్షేమం కోసం ఏ విధంగా కృషి చేయాలనే విషయాలను అతడి జీవితం ద్వారా నేర్చుకోవచ్చని, అతని బోధనలను పాటించినట్లయితే ప్రపంచమంతా శాంతి సమానత్వము వెళ్లి విరుస్తుందని, సేవా భావం అలవడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, నారేంద్రుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొందుకూరు శ్రీనివాస్ వేముల దేవ రాజం, గాదాసు భూమన్న, కొత్తకొండ బాలన్న, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, తునికి అంజన్న, చిలుక రాజన్న, బాశెట్టి ప్రభాకర్, ఎడమల వెంకటరెడ్డి, సిరిపురం గంగారం, గణపతి, నరేందర్ రాజు, ఆర్ఎస్ఎస్ వీరన్న, చిలుక సత్యం తదితరులు పాల్గొన్నారు.