కలెక్టరేట్, జూన్ 9 : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 87 సెంటర్లలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. మొత్తం 37,152 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 29,151 మాత్రమే హాజరైనట్లు యంత్రాంగం పేర్కొంది.

కరీంనగర్ జిల్లాలో 18,663 మందికి 14,577 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,699 మందికి 3,780, పెద్దపల్లి జిల్లాలో 6,098 మందికి 4,737 మంది, జగిత్యాలలో 7,692 మందికి 6,057 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. కాగా, నిమిషం నిబంధన పలువురి ఆశలపై నీళ్లు చల్లింది. అధికారులు లోనికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరుగడం కనిపించింది.