Pegadapalli | పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు హిందూ ధర్మ రక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ చేశారు. ప్రాథమిక సహకార సంఘం కార్యాలయ సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు గాను కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సాయికృష్ణ, సభ్యులు కార్తీక్, సుధాకర్, రాజశేఖర్, కొమురెల్లి, శ్రీనివాస్, గoగసాగర్, మల్లేశం, సుధాకర్, మహిపాల్, అరవింద్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.