Bommanapally | చిగురుమామిడి, మార్చి 26 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, కరీంనగర్ డైరీ మాజీ ఎండీ, ప్రస్తుత అడ్వైజర్ ఓరుగంటి హనుమంత రెడ్డి తో కలిసి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో దైవచింతనతో ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు, దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మానసిక ఉల్లాసానికి, భక్తి మార్గానికి ఆలయాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. శ్రీరామనవమి పర్వదినం ముందు రోజున ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషకరమన్నారు.
కరీంనగర్ పాల ఉత్పత్తిదారులు ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఓరుగంటి అరుణాదేవి హనుమంత రెడ్డి, మాజీ సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డి, ఉపసర్పంచ్ కాసర్ల హరీష్ కుమార్, మాజీ ఎంపీటీసీలు కత్తుల రమేష్, మిట్టపల్లి మల్లేశం, వార్డు సభ్యులు శృతి, తిరుమల, లక్ష్మి, ట్రస్టు బోర్డు అధ్యక్షుడు తాటి పెళ్లి లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి పెండల సదానందం, కోశాధికారి కంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.