Rompikunta | కమాన్ పూర్, జనవరి 26 : కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఆ గ్రామ సర్పంచ్ గుమ్మడి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ముత్యం శ్యామ్ సుందర్ సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసే అంబేద్కర్ విగ్రహం కోసం పొడవు ఐదున్నర పీట్లు, వెడల్పు ఐదు పీట్ల చొప్పున స్థలం కేటాయిస్తూ గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి స్థలం కేటాయించింది. ఆ స్థలంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో వార్డు సభ్యులు జంగిలి రాజు, ఎండి సుల్తాన్, బూత గద్దల పూజిత, కొయ్యడ కుమార్, పులిపాక మండయ్య, బాద్రపు మంజుల, కుందారపు కవిత, కొండి అనిల్, మీరాల రాజ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం కమిటీ నియామకం
రొంపికుంట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులుగా పులిపాక మొండయ్య, పులిపాక బొందాలు, అధ్యక్షుడిగా పులిపాక శంకరయ్య, ఉపాధ్యక్షులుగా పులిపాక మల్లయ్య, పులిపాక శంకర్, కాలెగూర తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా గొట్టే నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా గజ్జెల్లి సురేష్, ఆర్గనైజర్ గా బూడిద అనిల్, సహాయ ఆర్గనైజర్లుగా పులిపాక రాయమల్లు, పులిపాక మల్లేష్, కోశాధికారిగా పులిపాక లింగయ్య, కార్యవర్గ సభ్యులుగా పులిపాక కొమురయ్య, పులిపాక రాజేశం, కల్లేపెల్లి రాకేష్, గొట్టే శ్రావణ్, పులిపాక రమేష్, పులిపాక నగేష్, కలెగూర సది, గజ్జెల సంపత్‌ను ఎన్నుకున్నారు.