Veenavanka | వీణవంక, జూన్ 5: మండలంలోని బొంతుపల్లి గ్రామంలో పోచమ్మతల్లి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ జున్నుతుల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా జరిగాయి.
వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య పోచమ్మ తల్లి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు చదువు లక్ష్మి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు స్వరూప నరసింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.