Gangadhara | వెంకటాయపల్లిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
గంగాధర మండలం వెంకటాయపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీ నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గంకిడి సంధ్య రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపారు.
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 26 : గంగాధర మండలం వెంకటాయపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీ నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గంకిడి సంధ్య రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. 27న శ్రీ మహాగణపతి, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, పంచగవ్యప్రాసన, అంకురారోహణ, దీక్ష ధారణ, అఖండ దీపస్థాపన, షాడోష స్తంభ పూజ, వాస్తు యోగిని, నవగ్రహ, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండప ఆవాహన పూజలు, మూర్తి దేవత ఆవాహన, అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, వాస్తు హోమం, మంత్రపుష్పం, ఆవాహిత దేవతా పూజలు, నవగ్రహ హోమములు, జలాధివాసము తెలిపారు.
28న సుప్రభాతం, వేద పారాయణం, మూర్తులకు పంచామృత, నవనీత, సుగంధ ద్రవ్యాభిషేకం, యంత్ర అభిషేకం, రుద్ర హోమం, పంచసూక్త హోమం, అమ్మవారికి ముత్తైదువులచే సామూహిక కుంకుమార్చన, దేవతామూర్తులకు గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. 29న శయ్యాదివాస విమోచనం, దేవాలయ సంస్కారణ, గణపతి పూజ, శ్రీ సీత రామచంద్రస్వామి యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన కళాహావనం, కళా హోమం, ఓంకార నాదం, దృష్టి స్థాపన, కూష్మాండబలి, దేను దర్శనం, అగ్ని ప్రజ్వలన, అష్టదిగ్బంధన, పూర్ణాహుతి హోమం, శ్రీ సీతారాములకు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంగాధర మండలంతో పాట చుట్టుపక్కలాల మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

