Korutla | కోరుట్ల, జూలై 28 : కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించిన సరళ మంగళవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశాన్ని ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు.
ఉద్యోగ విధుల్లో నిబద్ధతతో పనిచేసిన ఆమె సేవలను ఉద్యోగులు కొనియాడారు. అనంతరం శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ వేముల సునీత రాణి, ప్రభుత్వ వైద్యులు వినోద్, రమేష్, గంగాధర్, విజయలక్ష్మి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.