Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 10 : మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన శంభు తిరుపతి దంపతుల కుమారుడు త్రినయ్ ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఫలితాల్లో స్టేట్ మెరిట్ ర్యాంక్ సాధించడం అభినందనీయమని అఖిల భారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడు సంగ గంగరాజం అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో త్రినయ్ను గురువారం శాలువాతో సత్కరించి స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుడిగా ఎదగాలనే లక్ష్యంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించడం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శం భవిష్యత్లో మంచి వైద్యుడిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అరకంటి గంగ మల్లయ్య, వేల్పుల రాజం, జాల మల్లేష్, ఎగుర్ల సోమయ్య, తొట్ల మల్లయ్య, బింగి మల్లేష్, మధు, సంపత్, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.