కార్పొరేషన్, నవంబర్ 28: కాలానుగుణంగా వాహనాల వినియోగం పెరిగింది. ప్రజల్లోనూ ఆధునిక బైక్స్, కార్ల మోడల్స్‌పై ఆసక్తి కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఔత్సాహిక కొనుగోలుదారులందరికీ అన్ని వివరాలు ఒకే వేదికపై అందించాలన్న ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఆటో షో నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే (సర్కస్ గ్రౌండ్) మైదానం వేదికగా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై, ఆదివారం రాత్రి 8గంటలకు ఈ ప్రదర్శన ముగియనుండగా, సందర్శకులకు ఉచిత ఎంట్రీ కల్పించారు. ఈ షోలో ప్రముఖ వాహనాల సంస్థలతోపాటు రుణాలు అందించే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.
ఈ షోకు మెయిన్ స్పాన్సర్స్‌గా ఆదర్శ ఆటో మోటివ్స్ మారుతి సుజికి, ఎరెనా, ట్రూ వాల్యు.. స్పాన్సరర్లుగా ఆదర్శ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మారుతి సుజికి నెక్సా, కాకతీయ టయోటా, మాలిక్ కియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మహింద్రా మోటర్ లైన్, వల్లభ యమహా మోటార్స్, సిట్రాన్ బీజేఆర్ ఆటో మోటివ్స్, హీరా సుజీకి టూవీలర్, ఎస్ఎస్ ఎలక్ట్రికల్ ఇకో టూవీలర్స్, గ్రీన్ హోండా, ఎంజీ కార్లు, మహావీర్ ఇష్యూజి, ప్రైడ్ జీప్, లక్ష్మి నిస్సాన్ వ్యవహరిస్తున్నాయి. ఫైనాన్స్ అందించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు అందుబాటులో ఉండనున్నాయి. వివరాలకు 9182777571, 9182777572 సెల్‌నంబర్లలో సంప్రదించాలని ‘నమస్తే’ యాజమాన్యం సూచించింది.