Chigurumaidi | చిగురుమామిడి, జూలై 9 : గ్రామపంచాయతీలో ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కే అనిల్ కుమార్ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, ఖర్చులు, బిల్లులు, చేపట్టిన పనుల రికార్డులు, ఎంపీ డబ్ల్యూ జీతాల రికార్డులు, ఈ పంచాయతీ పోర్టల్ పనితీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.
గ్రామంలో పన్ను వసూళ్ల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీకి ఆదాయం పెంపొందించుకునేందుకు వారసంతలు, ఇంటి పన్నులు, మార్కెట్ మొదలగు వాటిని వినియోగించుకోవాలన్నారు. గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి కాల్వ రమేష్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట డీఎల్పీవో హరికిషన్, ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీవో కిరణ్ కుమార్, సర్పంచ్ ఆకవరం భవాని, ఉపసర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కాల్వ రమేష్, కారోబార్ సత్యనారాయణ, మండల కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.