Formers | సారంగాపూర్, మే 22: సారంగాపూర్, బీర్ పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కూరిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. గురువారం ఆయా గ్రామాల్లో తడిసిన ధాన్యం రైతులు అరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
బీర్ పూర్ మండల కేంద్రంలోని బీర్ పూర్ సహకార కేంద్రం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు అకాల వర్షం వల్ల తడిచిపోయాయి. మండలంలోని రంగసాగర్ 850 బస్తాలు, కండ్లపల్లిలో 880 బస్తాలు, కందెనకుంటలో 750 బస్తాలు, మొతినగర్ లో 1050 బస్తాలు, చర్లపల్లి 400 బస్తాలు, తుంగూర్ లో 850 బస్తాలు తడిసిపోయాయి. సహకార సంఘ అధికారులు తడిచిన బస్తాలు మిల్ అలాట్మెంట్ కోసం పంపినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో వర్షానికి తడిసిన ధాన్యం చూస్తూ రైతులు ఆందోళన చెందుతున్నారు.