serp | చిగురుమామిడి, ఏప్రిల్ 14: తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (టీ సేర్ఫ్) ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. చిగురుమామిడి, బొమ్మనపల్లి గ్రామాల్లో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, గాగిరెడ్డి పల్లెలో మండల ప్రత్యేక అధికారి, మండల పరిషత్ సూపరిండెంట్ కాజామోహినుద్దీన్, ఇందుర్తిలో ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి, ఓబులాపూర్ లో వివో అధ్యక్షురాలు ఎండ్ర మహేశ్వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ నిబంధన ప్రకారము తే మశాతం, తాలు, చెత్త లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ధర ఏ గ్రేడ్ క్వింటాలకు రూ.2320, కామన్ గ్రేడ్ ధర క్వింటాలకు రూ.2300ను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ఈసారి సన్నాలకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ధర నిర్ణయించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ తాడ స్వరూప రాణి, మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు, మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్, ఏపిఎం మట్టేల సంపత్, సీసీలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, గంప సంపత్ కుమార్, వివో కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.