MLA Vijaya Ramana Rao | ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు : ఎమ్మెల్యే విజయ రమణారావు
MLA Vijaya Ramana Rao | ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
కాల్వశ్రీరాంపూర్ : ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు ( Grain Procurement ) చేస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు( MLA Vijaya Ramana Rao) అన్నారు. కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి, మడిపల్లి కాలనీ, తారుపల్లి, మీర్జంపేట, లక్ష్మీపురం, పందిల్ల, గంగారం, ఇప్పలపల్లి గ్రామాల్లో సహకార సంఘం, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకంలో ఎలాంటి కటింగ్ లు చేసినా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. తూకం అయిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. గతంలో కొనుగోలు చేసిన విదంగానే ఈసారి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సహకార సంఘం ప్రత్యేకాధికారి సురేందర్‌రెడ్డి, మానిటరింగ్ ఆఫీసర్ ఇమ్రాన్ఫాన్, మార్కెట్ కార్యదర్శి ప్రేమ్ కుమార్, ఏపీఎం లవకుమార్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సీఈవో కోలేటి శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

