Jagityal | సారంగాపూర్, మే 30: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని నర్సింహులపల్లి, చర్లపల్లి, కందెన కుంట గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షాలు కురుస్తున్నాయని త్వరగా కొనుగోళ్లు చేపట్టి ధాన్యం మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సీఈఓ తిరుపతి, సెంటర్ నిర్వాహకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.