Rudrangi | రుద్రంగి, మే 10 : అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని సెస్ డైరెక్టర్ ఆఫ్ గంగారం అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని అకాల వర్షాల నేపథ్యంలో తడిచిన ధాన్యాన్ని రోడ్డుపై ఉంచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం ఆదివారం కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి దాదాపు నెల రోజులు అవుతుందని మ్యాచర్ వచ్చిన ఇప్పటివరకు తూకం వేయడం లేదని ఆరోపించారు. అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలంటూ నినదించారు. ధాన్యం ఎప్పుడు కొంటారో హామీ ఇవ్వాలని తహసీల్దార్ పుష్పలత, ఏస్ఐ మోతిరామ్, డీఎస్ఓ బుచ్చిబాబు, డీఎంసీఎస్ నరసింహను కోరారు. రుద్రంగి మీదుగా వెళ్తున్నా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి అంటూ ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం లో రైతుల ధాన్యం త్వరిగతిన కొనుగోలు చేశామని అన్నారు. వ్యవసాయానికి అండగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో పని చేసిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగా చేసిందని ఎద్దేవా చేశారు. లారీల కొరత ఉందని సాకులు చెబుతూ మ్యాచర్ వచ్చిన వడ్లను తూకం వేయడంలో కూడా జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్దనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఇప్పటివరకు కేవలం 4వేల క్వింటళ్ల ధాన్యం మాత్రమే కొన్నారని ఇంకా 30 వేల క్వింటాళ్ల ధాన్యం అలాగే ఉందని మళ్లీ పంటలు వేసే సమయం వచ్చిన ధాన్యం కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పులూటి గణేష్ చెప్పాలని దేగావాత్ తిరుపతి, దయ్యాల కమలాకర్, మంచే రాజేశం, కంటె రెడ్డి, నాగులపల్లి రవి అల్లూరి గంగారెడ్డి, బోయిన చంద్రయ్య, కాదాస్ లక్ష్మణ్ కొడగంటి శ్యామ్, గంతే ప్రశాంత్, దయ్యాల నారాయణ, ఆకుల గంగాధర్ లావుడియా మోహన్, దయ్యాల పెద్దలు, ఇర్ణం రాజేశం, తర్రే గంగారెడ్డి, గడ్డం మహేందర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.