Graduation Day | కోల్ సిటీ , ఏప్రిల్ 26: గోదావరిఖని జవహర్ నగర్ సెక్టార్ పరిధి విఠల్ నగర్- 1 అంగన్వాడీ కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈసీసీఈ వార్షికోత్సవంలో భాగంగా అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి సీడీపీఓ అలేఖ్య ముఖ్యతిథిగా హాజరై అక్షరభ్యాసం పూర్తి చేసుకున్న ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చి ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే గ్రాడ్యుయేషన్ డే ప్రాముఖ్యత అని వివరించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు గ్రేడ్లు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ సెంటర్లలో ప్లే స్కూల్ విద్యను మరింత బలోపేతం చేయాలని టీచర్లకు సూచించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్లే స్కూల్ కోసం అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్ షరీన్, టీచర్లు కే శోభారాణి, ఎం నిర్మల, పీ శ్రీలత, ఈ సుజాత, హెల్పర్లు టీ స్వప్న, ఎం తిరుమల, లక్ష్మీతోపాటు పిల్లల తల్లులు పాల్గొన్నారు.