Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూలై 23: పెద్దపల్లి జిల్లాలో ఈనెల 27న జరిగే జీపీవో, లైసెన్స్ సర్వేయర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో జీపీవో, లైసెన్స్ సర్వేయర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంథని జేన్టీయూ కళాశాలలో లైసెన్స్ సర్వేయర్ పరీక్ష, పెద్దపల్లి (పెద్దకల్వల) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జీపీవో పరీక్ష ఆదివారం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాసులు, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.