insurance cheque | పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామ పంచాయతి లొ పారిశుధ్య కార్మికుడు ఏడేళ్ల నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ప్రతినిధులు రూ.10 లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు.
నర్సయ్య కూ బ్యాంకులో ఖాతా ఉండడంతో ఐవోబీ సురక్ష పథకం కింద రూ.354 చెల్లించగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రూ.10 లక్షల బీమా వర్తించినట్లు బ్యాంక్ మేనేజర్ రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రతీ ఒక్కరూ బీమా చేయించుకొని కుటుంబానికి బాసటగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్యాషియర్ సతీష్, బ్యాంక్ సిబ్బంది ప్రసాద్, సాగర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.