Welfare of the elderly | జగిత్యాల, జూన్ 15 : వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని జగిత్యాల డివిజన్ రెవెన్యూ అధికారి పులి మధుసూదన్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో 14 వ ప్రపంచ వయో వృద్దులపై వేధింపుల నివారణకు అవగాహన దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 26 మంది విశిష్ట వయో వృద్ధులను, ఆరుగురు ఉత్తమ కూతుర్లను, ఆరుగురు ఉత్తమ కుమారులను, ఆరుగురు ఉత్తమ కోడళ్లను ఆర్డీవో సన్మానించారు.
అనంతరం ఆర్డీవో పీ మధు సూదన్ మాట్లాడుతూ వయో వృద్ధులను వేధిస్తే చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తే 3 నెలలకు పైగా జైలుశిక్షతో పాటు జరిమానా విధించే వీలుందన్నారు. సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు వయోధికుల చట్టంపై అవగాహన సదస్సులు, కౌన్సిలింగ్లు నిర్వహిస్తుండడాన్ని అభినందించారు. సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ చట్టం ఉన్నా వయోవృద్ధులపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు 2016లో రాష్ర్టంలో రిటైర్డ్ ఉన్నత అధికారి పీ నర్సింహారావు ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ఏర్పాటు అయిన తమ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ వయోధికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ప్రభుత్వం గుర్తించిన, కృషి చేస్తున్న ఏకైక సంస్థ అని పేర్కొన్నారు.
మా అసోసియేషన్ కృషితో జగిత్యాల జిల్లా కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వృద్ధాశ్రమ నిర్మాణం పూర్తయితే నిరాధారణకు గురవుతున్న వృద్ధులకు ఊరట కలుగుతుందన్నారు. జిల్లా కేంద్రాల్లో డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో వయోధికుల కేసుల పరిష్కారంలో ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, ఎన్ శ్రీనివాస్ రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సెలింగ్ అధికారి పి.హన్మంత రెడ్డి, కోశాధికారి వెలముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, ఎండి యాకూబ్, పూసాల ఆశోక్ రావు, కోయ్యేడ సత్యనారాయణ, పబ్బా శివానందం, గంటేది రాజ్మోహన్, లక్ష్మినారాయణ, అధ్యక్షుడు వొజ్జల బుచ్చిరెడ్డి, సౌడాల కమలాకర్, వెల్ముల ప్రభాకర్ రావు, బీ రాజేశ్వర్, నక్క ఇంద్రయ్య, దేవేందర్ రావు, కొక్కు నారాయణ, ఎండీ ఇక్బాల్, సయ్యద్ యూసుఫ్, పుత్రయ్య, త్యాగరాజు, యాకూబ్ హుస్సేన్, ఉమ్మడి జిల్లా విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు దోనూరి భూమా చారి,వివిధ సంఘాల ప్రతినిధులు రాజ్ గోపాల్ చారి, సింగం గంగాధర్, నలువాల హన్మాండ్లు, రామ్ చంద్రం, సింగం భాస్కర్, పుప్పాల నర్సింగా రావు, అనుమల్ల సత్తయ్య, కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, సింగం పద్మ, దేవేంద్రమ్మ, బోబ్బాటి కరుణ, జిల్లా, డివిజన్, మండలాల సీనియర్ సిటీజేన్స్, పెన్షనర్ల, వివిధ యువజన, మహిళా, ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.