IIIT | కుభీర్, ఆగస్టు 09 : మండల కేంద్రం కుభీర్‌లోని నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన అల్కే చంద్రకళ, చిన్నన్న దంపతుల కుమారుడైన ఆల్కే పవన్ ఎన్సీసీ కోటాలో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. పవన్ ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు కుబీర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 6 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 549 మార్కులు సాధించి మండల రెండో టాపర్‌గా నిలిచాడు. అయినప్పటికీ త్రిబుల్ ఐటీలో సీటు రాకపోగా నిన్న నిర్వహించిన కౌన్సిలింగ్లో NCC కోటాలో పవన్‌కు త్రిబుల్ ఐటీలో చదివేందుకు అవకాశం లభించింది. దీంతో హై స్కూల్ హెచ్ఎం సట్ల గంగాధర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.