Special recognition | పెద్దపల్లి రూరల్ మే 17: పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన ఎంవోయూ పత్రాన్ని హైదరాబాద్ లో కళాశాల డైరెక్టర్ ఎడవల్లి నవతకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నవత మాట్లాడుతూ.. కళాశాల 26 సంవత్సరాల అనుభవంతో బీటెక్, ఎంటెక్ ఎంబీఏ డిప్లమా ల లో ఉన్న ఎమర్జింగ్ కోర్సులు కళాశాల మౌలిక వసతులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి లోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో పెద్దపెల్లి జిల్లాలో వీ హబ్ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పరచడానికి అనుమతిగా ఎంవోయూ పత్రాన్ని సీఎం అందజేసినట్లు తెలిపారు.
తమ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించే నైపుణ్య కేంద్రంలో రాబోవు విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు సెమినార్లు, వర్క్ షాప్ లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లు, ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు, నైపుణ్య వికాస తరగతులు, కెరియర్ డెవలప్ మెంట్ తరగతులు జరుగుతాయని తెలిపారు. కళాశాల చైర్మన్ ఎడవల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు ఎమర్జింగ్ కోర్సులు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులను ప్రవేశపెట్టడంలో ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిగా ఉంటుందని పేర్కొన్నారు.
గతంలో మైనింగ్ మెకానికల్ అగ్రికల్చర్ కోర్సులను ప్రవేశపెట్టి కొన్ని వేల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును అందించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఐటి, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులను మొట్టమొదటిగా ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత విద్యార్థులకు తమ ముంగిట్లో నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తొడుపునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కళాశాల నైపుణ్యాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి వీహబ్ కేంద్రాన్ని తమ కళాశాలలో ఏర్పరచినందుకు చాలా గర్వంగా ఉందన్నారు.
నూతనంగా ఇంజినీరింగ్ లో చేరబోవు విద్యార్థులు కళాశాల యొక్క అనుభవం బీటెక్, ఎంటెక్, ఎంబీఏ కోర్సులు ప్రభుత్వం నిర్ణయించిన కళాశాల యొక్క ట్యూషన్ ఫీజు మౌలిక వసతులు చూసుకొని కోర్సులను కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరిచి కళాశాల అధ్యాపకులు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థులు తమ కళాశాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.