Vivekananda Inspiration Award | కాల్వశ్రీరాంపూర్, జనవరి 12 : మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్ వివేకానంద జన్మదిన సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో శ్రీస్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ప్రజా ప్రతినిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ గా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ గత 30 సంవత్సరాలుగా ప్రజలందరికీ ఎన్నో సేవలందించారు.
ఇందుకుగాను జాతీయ తెలుగు సారస్వత పరిషత్, ఆది లీల ఫౌండేషన్ (న్యూఢిల్లీ) సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గోపగోని సారయ్య గౌడ్ కు మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, వకులాభరణం కృష్ణమోహన్, మెజిస్ట్రేట్ టీ నర్సిరెడ్డి చేతులమీదుగా వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షుడు కేసిరాజు రాంప్రసాద్, ఆ శాఖ తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి ఇప్పలపల్లి చంద్రహాస్, ఆది లీల ఫౌండేషన్ న్యూఢిల్లీ ఫౌండర్, చైర్మన్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.