Gold medal | కమాన్ పూర్, సెప్టెంబర్ 17 : కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి భారతి-శంకర్ ద్వితీయ కుమార్తె నల్లవెల్లి ఆనంది అథ్లెటిక్స్ లో ప్రతిభకనబరుస్తూ సత్తా చాటుతోంది. ఆనంది వరుసగా జరుగుతున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ వాటిలో రాణిస్తూ ఆవార్డులు, ప్రశంసలు పొందుతూ వస్తోంది. ఈ గ్రామీణ క్రీడాకారిణి ఒకవైపు చదువుతో పాటు ఆటల్లోనూ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా పుదుచ్చేరిలో 37వ సౌత్లోన్ చాంపియన్ షిఫ్ అండర్ 18 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో అత్యుత్తమ ప్రతిభతో ముందు వరుసలో నిలిచి బంగారు (గోల్డ్ మెడల్) పతాకాన్ని సాధించింది.
గతంలో కూడా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని బంగారు పతాకాలను సాధించిన సంగతి తెలిసిందే. కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామంలో గల కమాన్ పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ ద్వితియ సంత్సరం సీఈసీ చదువుతోంది. పుదుచ్చేరిలో నిర్వహించిన పోటీల్లో బంగారు పతాకాన్ని సాధించిన నల్లవెల్లి ఆనందికి ఆ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, అలాగే మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆనంది ప్రతిభ పట్ల అభినందనలు, ప్రశంసలు తెలియజేశారు.