Jagityal | జగిత్యాల, సెప్టెంబర్ 29 : కనక దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అష్ట లక్ష్మి దేవాలయ అవరణలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం కనక దుర్గ అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గోవిందుల రాధాకృష్ణ, అజయ్ శర్మ వేదపండితులచే విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజ అనంతరం సాయంత్రం మహాదేవునికి రుద్రాభిషేకం, బిల్వవర్చన నక్షత్ర హారతి, మహిళలు, భవానీ దీక్ష స్వాములతో, భక్తులతో అమ్మవారు మండపం కిటకిటలాడింది. సప్త హారతులతో మండపం ప్రాంగణం భక్త కీర్తనలతో మారుమోగింది.