సుల్తానాబాద్ రూరల్ సెప్టెంబర్ 26: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుక్రవారం కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమానికి కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, శోభ రాణి దంపతులు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి వేరువేరుగా హాజరై పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత, అన్న ప్రసాద వితరణ దాత పోగుల సరోజన ,రాజయ్య, అనిల్ , రాజు , బిజెపి నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాసర్ల అంజలి, జాగృతి మండల అధ్యక్షుడు ఐలయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ సంపత్ యాదవ్, గ్రామస్తులు శ్రీనివాసరావు, విజయ్ రావులతోపాటు తదితరున్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో గర్రెపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్ పర్యటించి దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు.