Donated Eyes | కోల్ సిటీ, డిసెంబర్ 6: గోదావరిఖనిలో మొదటి తరం కిరాణం వర్తక వ్యాపారుల్లో ఒకరైనా పాత బావు సేట్ (82) కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన పాత బాపు 50 యేళ్లుగా కిరాణం వ్యాపారిగా పారిశ్రామిక ప్రాంతంకు సుపరిచితుడు. కాగా ఆయన మృతి చెందగా పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా కుటుంబ భ్యులు సమాజ హితం కోసం ఆలోచించి ఆయన నేత్రాలను దానం చేయడంతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించారు. స్థానికులతో సత్సంబంధాలు ఏర్పర్చుకున్న పాత బాపు సేట్ మరణంతో వ్యాపారులు, ఆయన సన్నిహితులు, పలువురు రాజకీయ పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నిషియన్ ప్రదీప్ ఆయన కార్నియాలను సేకరించి హైదరాబాద్ కు తరలించారు. నేత్రదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు హారిక, ప్రకాశ్, సంతోషి, నగేశ్, విజయ, సరళ, సుదర్శన్, రజనీ, విష్ణుతోపాటు మనవలు, మనవరాళ్లను సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రతినిధులు లింగమూర్తి, రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, చంద్రమౌళి, వాసు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్లి కవిత అనంత రాములు, చంద్రశేఖర్ తోపాటు స్థానిక వ్యాపారులు అభినందించారు. ఆయన ఆకాల మృతికి సంతాపం ప్రకటించారు.