Godavarikhani | గోదావరిఖని/ఫర్టిలైజర్‌సిటీ : తమ పిల్లలు పట్టించుకోవడం లేదంటూ గోదావరి నదిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని ఓ వృద్దురాలికి కౌన్సెలింగ్ నిర్వహించి గోదావరఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి భరోసా కల్పించారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని-1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి విఠల్ నగర్ చెందిన ఓ వృద్ధురాలు గురువారం తన పిల్లలు పట్టించుకోవడం లేదని, వాళ్లకు తాను భారంగా ఉండటం ఎందుకు అని మనస్థాపం చెంది గోదావరి నదిలో దూకి చనిపోవాలని నిర్ణహించుకొని ఆటో ఎక్కి డ్రైవర్ కి గోదావరి నది వద్దకు వెళ్లాలని చెప్పింది.
ఆ డ్రైవర్‌కు తాను చనిపోతానని తెలపడంతో ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రిసెప్షన్ సిబ్బందికి వివరాలను వివరించగాఆ వృద్ధురాలిని సిబ్బంది సీఐ ఇంద్రసేనా రెడ్డికి కల్పించారు. దీంతో సీఐ ఆమె నుండి వివరాలు తెలుసుకుని వృద్ధురాలికి తామున్నామని, అధైర్యపడొద్దని కౌన్సెలింగ్ నిర్వహించి భరోసా కల్పించారు. విఠల్ నగర్ ప్రాంతంలోని ఓ ప్రజాప్రతినిధితో మాట్లాడి కుటుంబం సభ్యులకు ఎస్సై అనూష, బ్లూ క్లోట్స్ సిబ్బందితో కౌన్సిలింగ్ నిర్వహించారు.