ధర్మారం/ రామడుగు/ మల్యాల/ మెట్పల్లి రూరల్, ఆగ స్టు 2 : ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎస్సారెస్పీ వైపు ఎదురెక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నంది మేడారంలోని నంది, రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌లతో పాటు, పునర్జీవ పథకం ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్, మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్‌లలో ఆదివారం నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా వరదకాలువకు వస్తున్న జలాలు.. అక్కడి నుంచి ఒకవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలుతుండగా, మరోవైపు రాంపూర్, రాజేశ్వర్‌రావు పంప్‌హౌస్‌ల ద్వారా ఎస్సారెస్పీ వైపు ఎదురెక్కుతున్నాయి.