GodavariKhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 8 : కర్నూలులో జరిగిన 13వ జీకేఎంఎస్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్-2026 పోటీల్లో గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3155 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో గోదావరిఖని నుంచి కటాస్, కుమితే విభాగాల్లో సత్తా చాటారు. బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగంలో టీ.జయ సాయిచరణ్, సహస్రలు స్వర్ణ పతకాలు సాధించగా, స్పందన, వశికర్, సాయి రోషన్, ప్రణీత్, అశ్విత్ రెడ్డిలు రజత, కాంస్య పతకాలు సాధించారు.
అలాగే కలర్ బెల్టు విభాగంలో ఆయాన్. భార్గవ రామ, అదిత్రిలు స్వర్ణ పతకాలు, శ్రీనందన్, బీ.సాత్విక్, హ్రీద్యరెడ్డి, శర్యాణిలు రజత పతకాలు సాధించారు. అలాగే బ్లాక్ బెల్టు కుమితే విభాగంలో టీ. జయసాయిచరణ్. యజ్ఞశ్వర్ రెడ్డి, వశికర్ స్వర్ణ పతకాలు, ఆల్ కలర్ బెల్టు విభాగాల్లో అయాన్, భార్గవ రామ, శైలందరు స్వర్ణ పతకాలు సాధించారు. వీరికి శిక్షణ ఇచ్చిన పసునూటి చందును పోస్కాయ్ ఇండియా చీఫ్ రచ్చ శ్రీనుబాబు, జిల్లా కరాటే మాస్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.