Girls Empowerment | జ్యోతినగర్, మే 28: బాలికల సాధికారిత ధ్యేయంగా ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో గర్ల్స్ ఎంపైర్మెంట్ మిషన్ పేరిట వేసవి కాలంలో కొనసాగుతున్న బాలికల సాధికారత వర్కుషాప్ లో ని భాలికల సాంస్కృతిక ప్రదర్శన వేడుక అలరింప చేసింది. టౌన్షిప్ లోని కాకతీయ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాల్లో బాలికల నృత్యప్రదర్శన, పాటలు, ప్రసంగాలు, స్కిట్లు, యోగా, కరాటే ప్రదర్శనలతో వారి ప్రతిభను చాటుకున్నారు.
ఈ వేడుకలకు సంయుక్త మహిళా సమితి సీనియర్ సభ్యురాలు సునీత జైకుమార్ శ్రీనివాసన్, దక్షిణ దీపాంజలి మహిళా సమితి అధ్యక్షురాలు రంజనా దువా అతిథులుగా హజరై తిలకించారు. అనంతరం బుధవారం వారు వర్కుషాప్ను సందర్శించారు. తరగతి, భోజన గదుల సందర్శన, బాలికల విద్యాభ్యాసం, వర్కుషాప్ లో రోజువారి పనులను ప్రశంసించి బాలిక సాధికారతపై ప్రసంగించారు. అనంతరం వర్కుషాప్ ఆవరణలో మొక్కలు నాటారు.